పేదలకు అండ కూటమి ప్రభుత్వం..! ముక్కా రూపానందరెడ్డి

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మార్చి 04 మనస్సాక్షి:

రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం మార్గోపల్లి పంచాయతీ గుడ్లవారిపల్లి కి చెందిన ముక్కట్ల రేవతి కి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.32,295/- విలువైన చెక్కును వారి నివాసం వద్ద రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ, “అవసరంలో ఉన్న కుటుంబాలకి అండగా నిలవడం తమ ప్రధాన బాధ్యత అన్నారు. ప్రజలు ఆరోగ్య సమస్యలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకొని వాటికి పరిష్కారం చూపడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాటూరు శ్రీనివాసులురెడ్డి, రాజకుంట సర్పంచ్ నరసింహ, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp