ఆటో యూనిన్ సంక్షేమానికి జనసేన పార్టీ కృషి చేస్తుంది.. తాతంశెట్టి, బత్తిన

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మార్చి 01 మనస్సాక్షి: పట్టణం మామిడికాయల యార్డు నందు కోడూరు ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు బత్తిన గంగయ్య యాదవ్,యూనియన్ అధ్యక్షుడు సిద్దేశ్వర, సలహాదారుడు ఉదయ్ ల ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పగడాల వరలక్ష్మి నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు,క్రమశిక్షణ, బడుగు బలహీన వర్గాల మీద అయన చూపుతున్న ప్రేమాభిమానాలకు ఆకర్శితులై జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నామని ఉదయ్ కుమార్ తెలిపారు. ఆటో యూనియన్ సభ్యులందరికీ సభ్యత్వ రుసుము గౌరవ సలహాదారుడు బత్తిన గంగయ్య యాదవ్ చెల్లించారు, యూనియన్ సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా తామే రుసుము చెల్లిస్తామని రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర, వరలక్ష్మి ప్రకటించారు, ఆటో యూనియన్ కార్యాలయానికి స్థలం కేటాయించాలని యూనియన్ సభ్యులు కోరగా, యూనియన్ సభ్యులందరికి అందుబాటులో ఉండే విధంగా 5 సెంట్లు స్థలం కేటాయించి భవనాన్ని కూడా తామే నిర్మించి ఇస్తామని తాతంశెట్టి నాగేంద్ర హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తామని ఈ సందర్బంగా యూనియన్ కార్యవర్గ సభ్యులు తెలిపారు.ఈ సందర్బంగా 90 మంది సభ్యత్వం నమోదు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు యానాదయ్య, ఉత్తరాది శివ,ఆటో యూనియన్ సభ్యులు వెంకటేష్, గంగాధర, సుబ్బరాయుడు, నరసింహులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp