గ్లోబల్ సర్వీస్ ఆధ్వర్యంలో మాస్టర్ టైలర్ కోర్సు నందు ఉచిత శిక్షణ..*

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మార్చి 01 మనస్సాక్షి : కోడూరు పట్టణంలోని స్థానిక గిరిజమ్మ వీధిలోని గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ టైలరింగ్ శిక్షణా కేంద్రము నందు నారీ నైపుణ్యం ప్రాజెక్ట్ ద్వారా మహిళలకు మాస్టర్ టైలర్ కోర్సు నందు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ కె.పార్థసారధి తెలిపారు. గత 15 సంవత్సరాలుగా స్వంత ఖర్చులతో 3200 మందికి పైగా మహిళలకు టైలరింగ్ నందు ఉచిత శిక్షణ ఇచ్చామని, ఈ నెల 8వ తేదీ నుండి గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ నారీ నైపుణ్యం ప్రాజెక్ట్ ద్వారా మహిళలకు మాస్టర్ టైలర్ కోర్సు నందు ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణా సమయంలో పదివేల రూపాయలు విలువగల టైలరింగ్ మెటీరియల్స్ టూల్ కిట్ ను మరియు శిక్షణ అనంతరం ఇరవై ఐదువేల రూపాయలు విలువ గల ఇండస్ట్రియల్ కుట్టు మెషిన్ ఉచితంగా ఇస్తున్నామన్నారు.

టైలరింగ్ రంగంలో ఉపాధి పొందాలనుకునే పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఈ అవకాశం ఉపయోగించుకోవాలన్నారు. ఆసక్తి గల మహిళలు ఈ నెల 4 తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు స్థానిక గిరిజమ్మ వీధిలోని గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ కార్యాలయం నందు సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలియజేశారు

Facebook
X
LinkedIn
WhatsApp