స్వచ్ఛ రథం ను ప్రారంభించిన లక్ష్మీప్రసాద్ రెడ్డి

అన్నమయ్య జిల్లా, ఫిబ్రవరి 28: రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలంలో గ్రామీణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన “స్వచ్ఛ రథం” కార్యక్రమాన్ని టిడిపి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. మండల టిడిపి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన ఆయన, ఇంటింటికీ వచ్చే ఈ రథానికి ప్లాస్టిక్, గాజు, పేపర్ వంటి పనికిరాని వ్యర్థాలను ఇస్తే వాటిని తూకం వేసి బదులుగా నిత్యావసర వస్తువులు లేదా డబ్బులు అందిస్తారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సేకరించి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ రథాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp