తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఫిబ్రవరి 28 (మనస్సాక్షి ): తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఉత్తర్వుల మేరకు, రేణిగుంట డిఎస్పీ వై. శ్రీనివాస్ రావు ఆదేశాల ప్రకారం, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ “వజ్ర ప్రహర్” కార్యక్రమంలో భాగంగా రైల్వే కోడూరు రూరల్ సీఐ డి శ్రీనివాసులు, అర్బన్ సీఐ శ్రీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో, ఓబులవారిపల్లి ఎస్సై పి. మహేష్, రైల్వే కోడూరు ఎస్సై ప్రసాద్ రెడ్డి, రైల్వే కోడూరు రూరల్ సిబ్బంది కలిసి ఓబులవారిపల్లి మండలం మంగంపేట గ్రామంలోని 1వ మరియు 2వ వీధుల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో ముఖ్యంగా గంజాయి అక్రమ రవాణా, నిల్వ మరియు వినియోగాన్ని అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు గృహాలను సమగ్రంగా తనిఖీ నిర్వహించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు సమాజంలో నేరాల పెరుగుదలకు కారణమ వుతున్నందున,వాటి నిర్మూలనకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.అదేవిధంగా, ప్రజలకు గంజాయి అమ్మకం,నిల్వ, వినియోగం చట్టవిరుద్ధమని, అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీకుంటామని అవగాహన కల్పించారు. గంజాయి సంబంధిత సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని సూచించారు. మహిళలపై నేరాలు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు మరియు దొంగతనాల నివారణపై కూడా అవగాహన కల్పించారు. జిల్లాలో గంజాయి నిర్మూలన మరియు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కావున ప్రజలు పోలీసులకు సహకరించి గంజాయి రహిత సమాజ నిర్మాణానికి తోడ్పడాలని కోరారు.
అసాంఘిక కార్యకలాపాలు గంజాయి అక్రమరవాణా వినియోగం పై ఉక్కుపాదం.
Post Views: 1
Facebook
X
LinkedIn
WhatsApp