“కష్టకాలంలో” అండగా సీఎం రిలీఫ్ ఫండ్.

రైల్వే కోడూరు, ఫిబ్రవరి 24 మన స్సాక్షి:

కోడూరు మండలానికి చెందిన భూమా లోకేష్ కుమార్ రెడ్డి కి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.22,590/- విలువైన చెక్కును ఆయన నివాసం వద్ద అందజేసిన రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ అధ్యక్షులు, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, “ప్రజలు అనారోగ్యం అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం అందేలా నిరంతరం కృషి కొనసాగుతుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp