రైల్వే కోడూరు ఫిబ్రవరి 23 కలం మనస్సాక్షి :తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోడూరు పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.ఈ సందర్భంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు తిరుపతి జిల్లా అధ్యక్షురాలు ఎస్. శ్రీలక్ష్మి మాట్లాడుతూ, ఏపీ అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తిస్తూ కనీస వేతనం రూ.26,000- ఇవ్వాలని, అర్హులైన వారికి సూపర్వైజర్ పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న టీ.ఏ, డి.ఏలు మంజూరు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని కోరారు.ప్రీస్కూల్ విద్యను బలోపేతం చేసి, ప్రీస్కూల్ పిల్లల తల్లులకు “తల్లికి వందనం” పథకం అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని, అర్బన్–రూరల్ అనే తేడా లేకుండా అందరికే సంక్షేమ పథకాలు సమానంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎన్నికల సమయంలో నాయకులు హామీలు ఇస్తున్నప్పటికీ తమ న్యాయమైన డిమాండ్లు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం నారా లోకేష్‌ను కలవడానికి అవకాశం కల్పించలేదని, అంగన్వాడీ సంస్థ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ వంటి రాష్ట్రాల్లో పనికి తగిన వేతనాలు ఇస్తున్నారని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అమలు కావడం లేదని విమర్శించారు.గత ప్రభుత్వంలో మే నెల సెలవుల కోసం 42 రోజుల పాటు దీక్షలు చేసినట్లు గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం స్పందించకపోతే 365 రోజులు దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు.మూడు రోజులు కోడూరులో రిలే నిరాహార దీక్షలు నిర్వహించి, అనంతరం రెండు రోజులు తిరుపతి జిల్లా కేంద్రంలో దీక్షలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎన్.రమాదేవి, వర్కింగ్ ప్రెసిడెంట్ టి. రాధాకుమారి, ట్రెజరర్ జి. పద్మావతి తో పాటు మూడు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.!
Post Views: 5
Facebook
X
LinkedIn
WhatsApp