“రెడ్ బుక్ ” రాజ్యాంగానికి భయపడే ప్రసక్తే లేదు.. మాజీమంత్రి అంబటి రాంబాబు

రైల్వే కోడూరు జనవరి 22 కలం మనస్సాక్షి:

రైల్వే కోడూరు మండలంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీమంత్రి అంబటి రాంబాబు, రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి  కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడారు. ముందుగా కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ,రాష్ట్రంలో నారా లోకేష్ కనుసన్నల్లో “రెడ్ బుక్ రాజ్యాంగం” అమలవుతోందని, మంత్రి అంబటి రాంబాబు, ఆయన భార్యా బిడ్డలపై దాడి చేయించడం, అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపడం తగదని మండిపడ్డారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, తనను అన్యాయంగా అరెస్టు చేసి 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్బంధించారని, ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిందన్నారు. తన ఇంటిపై, కార్యాలయంపై, తన భార్యా బిడ్డలపై సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూటమి ప్రభుత్వానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేస్తూనే వున్నారని ఆరోపించారు. అక్కడే ఉన్న పోలీసులు కేవలం చూస్తూ ఉండిపోవడానికే పరిమితం అయ్యారని విమర్శిలు గుప్పించారు.తనపై దాడి చేసి, తనపైనే కేసులు పెట్టి జైలుకు పంపారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై ఎన్ని కేసులు పెట్టించినా, జైలుకు పంపినా తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వై సీపీ నాయకులపై కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మంత్రి నారా లోకేష్ “రెడ్ బుక్ రాజ్యాంగానికి” ఇక్కడ ఎవ్వరూ భయపడబోరని మరోసారి స్పష్టం చేశారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ప్రతిబింబించలేదని ఇది ప్రజలను మోసం చేసే బడ్జెట్ అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి ప్రజలను చీటింగ్ చేస్తోందని అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు జడ్పీటీసీలు నియోజకవర్గ మండలాల పార్టీ ఇన్చార్జులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp