రైల్వే కోడూరు ఫిబ్రవరి 21 కలం మనస్సాక్షి :
గతంలో గంజాయి తీసుకున్నవారిని,అమ్మిన వారిని గుర్తించి చిట్వేల్ మండల పోలీస్ స్టేషన్ కు శనివారం పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించిన రైల్వే కోడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గంజాయి అమ్మకం,వాడకం, రవాణా చట్టరీత్యా నేరమని అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని లేకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో చిట్వేల్ మండల ఎస్సై వినోద్ కుమార్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 2