మరిన్ని వసతులతో మైదానాన్ని అభివృద్ధి చేస్తాం

మదనపల్లె, ఫిబ్రవరి 21:
బీటీ కళాశాల మైదానాన్ని మరిన్ని వసతులతో అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.
శనివారం ఉదయం షాజహాన్ భాషాతో కలిసి జిల్లా కలెక్టర్ బీటీ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. మైదానంలో ప్రతిరోజూ యువతీ యువకులు, వయసు పైబడిన వారు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో, అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైదానానికి వచ్చే ప్రజలకు తాగునీరు, విశ్రాంతి స్థలాలు, శుభ్రతా సదుపాయాలు వంటి అవసరాలపై దృష్టి సారించి, మరింత సౌకర్యవంతంగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ, మదనపల్లె పట్టణానికి ఎంతో ప్రాధాన్యత కలిగిన బీటీ కళాశాల మైదానాన్ని అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్ కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి ఇది మరింత తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp