రైల్వే కోడూరు నియోజకవర్గం ఫిబ్రవరి 21 కలం మనస్సాక్షి:
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి కుమారులు ముక్కా సాయి వికాస్ రెడ్డి, ఈరోజు జన్మదిన వేడుక, ముక్కా విశాల్ రెడ్డి, జన్మదిన రేపు కావడంతో ముక్కా సాయి వికాస్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. మొదట శివాలయంలో పూజలు చేసి సాయి వికాస్ రెడ్డి, విశాల్ రెడ్డి, ఇద్దరూ నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, నియోజకవర్గ ప్రజలకి మంచి చేయాలని పూజలు నిర్వహించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో 450 మంది విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్సిల్, చాక్లెట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అరవింద్, శంకర్, చిన్న, ప్రేమ్, అబ్దుల్ రెహమాన్, ఇంకా అభిమానులు పాల్గొని కార్యక్రమాలన్నీ విజయవంతం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముక్కారూపానంద రెడ్డి ఫౌండేషన్ స్థాపించి నియోజకవర్గ ప్రజలందరికీ ఎంతో మంచి చేస్తున్న మా నాయకుడు సాయి వికాస్ రెడ్డి బాటలోనే తాము పయనిస్తూ ఉన్నామని, ముక్కా కుటుంబం ఎప్పుడు చదువుకి పెద్దపీటమేస్తున్నదని, వారి బాటలో తాము కూడా పాఠశాల విద్యార్థులకు బుక్స్ అందించి అలాగే కోడూరు పట్టణంలోని టోల్గేట్ వద్ద అన్నదాన కార్యక్రమం చేయటం జరిగిందని వారన్నారు. తమ యువ నాయకుడు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అందరికీ ఏమి కావాలో అడిగి తెలుసుకుని అన్ని పనులు చేసిస్తూ ఉంటారని అలాంటి యువ నాయకులకి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందని వారందరూ తెలియజేశారు