తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం:
ఆచార్య నగార్జున యూనివర్సిటీ పరిధిలో ఉన్న డాక్టర్ వైయస్సార్ ఏ.ఎన్.యూ ఇంజనీరింగ్ కళాశాల కు వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు తొలగించడం అత్యంత ఖండనీయమని రైల్వే కోడూరు నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎల్. మౌనేంద్ర కుమార్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగ అభివృద్ధికి పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా అపూర్వ సేవలు అందించారని అలాంటి మహానేత పేరు ఒక ఇంజనీరింగ్ కళాశాలకు ఉండడం గౌరవ సూచికంగా కొనసాగించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు పేర్లు తొలగించడం ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసే చర్యగా పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని పునః పరిశీలించి డాక్టర్ వైయస్సార్ ఏఎన్ యూ ఇంజనీరింగ్ కళాశాల పేరును యధావిధిగా కొనసాగించాలని ఈ సందర్భంగా మౌనేంద్ర కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.