తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం- ఓబులవారిపల్లి, చిట్వేలు మండలాల పరిధిలోని శివ క్షేత్రాలలో ఇటీవల మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంవంతంగా నిర్వహించిన పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ అనుబంధ సంస్థలు, ప్రజా నాయకులు, దాతలను రేణిగుంట డివిజనల్ డీఎస్పీ వై. శ్రీనివాసరావు శాలువాలతో సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సమన్వయం, ప్రజల సహకారంతో మహాశివరాత్రి పర్వదినం సాఫీగా, దిగ్విజయవంతంగా జరిగిందని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక శుభాభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు అర్బన్ సీఐ చంద్రశేఖర్, రూరల్ సీఐ డి. శ్రీనివాసులు, కోడూరు ఎస్సై ఎల్.వి. ప్రసాద్ రెడ్డి, ఓబులవారిపల్లి ఎస్సై మహేష్ నాయుడు, చిట్వేలు ఎస్సై వినోద్ కుమార్, అలాగే ఇతర ప్రభుత్వ సిబ్బంది, వై.కోట మాజీ సర్పంచ్ బాలాజీ, సర్పంచ్ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
శివరాత్రి పర్వదినం దిగ్విజయవంతం – అధికారులను సన్మానించిన డీఎస్పీ వై. శ్రీనివాసరావు
Post Views: 1
Facebook
X
LinkedIn
WhatsApp