సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం

పుల్లంపేట మండలం తిరుమలయ్య గారిపల్లికి చెందిన దూరి రామచంద్రయ్యకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 25,166 రూపాయల చెక్కును వారి నివాసం వద్ద రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి అందజేశారు. ప్రజలు కష్టసమయంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp