హైస్కూల్ నూతన భవనం ఘన ప్రారంభం

రైల్వే కోడూరు నియోజకవర్గంలోని కొత్త కోడూరు కామిశెట్టి నగర్‌లో ఉన్న శ్రీ సాయి బాలాజీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నూతన భవనం ప్రారంభోత్సవానికి కరస్పాండెంట్ పోకల బాబు, డైరెక్టర్ ఉప్పలపాటి శ్రీనివాస్ రాజు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి, తనయుడు ముక్కా విశాల్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ, విద్యార్థులు ఆధునిక మరియు సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకుంటే ఉత్తమ ప్రతిభ కనబరుస్తారని తెలిపారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జయప్రకాశ్, ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రముఖులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కొత్త భవనం ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని నిర్వాహకులు తెలిపారు.

Facebook
X
LinkedIn
WhatsApp