మదనపల్లె : అన్నమయ్య జిల్లా ములకలచెరువు అక్రమ మద్యం కేసులో సోమవారం తంబళ్లపల్లె కోర్టులో హాజరుకానున్న మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్‌ను మదనపల్లె వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ మర్యాదపూర్వకంగా కలిశారు. హార్సిలీహిల్స్‌కు రాత్రి బసకు వెళ్తున్న సందర్భంగా అన్నమయ్య సర్కిల్ వద్ద ఆయనను కలిసి దుశ్శాలువతో సన్మానించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించారు. మదనపల్లె నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నిస్సార్ అహమ్మద్ చేస్తున్న కృషిని జోగి రమేష్ కొనియాడారు. కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మనోజ్ రెడ్డి, వైస్ చైర్మన్ నూర్ ఆజాం, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 2