పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న శ్రీకాంత్ రెడ్డి

గుజరాత్ / రాయచోటి :
వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి సతీసమేతంగా గుజరాత్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను భక్తిశ్రద్ధలతో దర్శించారు. శ్రీకృష్ణుడి నడయాడిన పవిత్రక్షేత్రం ద్వారక, రుక్మిణీ మాత ఆలయాలను, బేట్ ద్వారక లను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 12 జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన సోమనాథేశ్వర, నాగేశ్వర జ్యోతిర్లింగాలను వారు దర్శించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ జన్మస్థలమైన పోర్‌బందర్‌ను సందర్శించి, ఆయన జన్మించిన గృహాన్ని సందర్శించి, దేశానికి సత్యం, అహింస మార్గాలను చూపిన ఆ మహనీయుని స్మరించుకున్నారు. గుజరాత్ రాష్ట్ర అభివృద్ధిపై స్పందించిన శ్రీకాంత్ రెడ్డి, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో గుజరాత్ రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని అభిప్రాయపడ్డారు. గుజరాత్ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పారిశ్రామిక, వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని తన సంకల్పమని ఆయన తెలిపారు. భగవంతుని అనుగ్రహంతో ప్రజలందరూ సంతోషంగా,సుభిక్షంగా జీవించాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు.

Facebook
X
LinkedIn
WhatsApp