అయ్యవారురెడ్డి ఆధ్వర్యంలో టిడిపిలో చేరికలు

రాయచోటి, కలం మనస్సాక్షి :
పట్టణంలోనే మాసాపేట రెడ్డివారిపల్లె ఒకటో వార్డుకు చెందిన రాయచోటి వైసిపి నాయకుడు పాలంపల్లె అయ్యావార్ రెడ్డితో పాటు దాదాపు 20 కుటుంబాలు వైసీపీను వీడి టిడిపిలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరికీ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజులలో వైసీపీ కార్యకర్తలతో పాటు నాయకులు కూడా వైసీపీ పార్టీపై విశ్వాసం కోల్పోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి వైసిపి నుండి టిడిపిలోకి భారీగా చేరారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ కొండా భాస్కర్ రెడ్డి,రాయచోటి ఏఎంసీ చైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు గాజుల ఖాదర్ భాష, బోనమల ఖాదరవల్లి, రవి, జంగం రెడ్డి, వెంకటరామిరెడ్డి, కృష్ణారెడ్డి, శివారెడ్డి, జిలాని, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp