అంబికా రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో మండిపల్లి

రామపురం :
అన్నమయ్య జిల్లా రామాపురం మండలం, నీలకంఠరావుపేట దగ్గర అన్నయ్య, ఆగ్రో వెంకట్రాంరెడ్డి అంబికా ఫ్యామిలీ రెస్టారెంట్ ను ఆంధ్రప్రదేశ్ రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వినియోగదారులకు సేవలు అందిస్తూ మన్ననలు పొందాలన్నారు. ఫ్యామిలీ రెస్టారెంట్ దినదినాభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమాని అన్నయ్యకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ కొండా భాస్కర్ రెడ్డి, మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp