వధూవరులను ఆశీర్వదించిన రాజకీయ ప్రముఖులు

సుండుపల్లె, కలం మనస్సాక్షి :
తెదేపా నేత చెన్నంశెట్టి వెంకటరమణ కుమారుడు భాస్కర్, త్రివేణిల వివాహానికి శుక్రవారం రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి మేడ విజయ్ శేఖర్ రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, భాజపా అసెంబ్లీ కన్వీనర్ రామా జగదీష్, జనసేన వీర మహిళా రెడ్డి రాణి, అసెంబ్లీ నాయకులు రామ శ్రీనివాస్, వైకాపా జిల్లా ఉపాధ్యక్షురాలు అజంతా రాణి, చప్పిడి రమేష్ నాయుడు టిడిపి, బిజెపి, జనసేన, వైకాపా నాయకులు, చెన్నంశెట్టిపల్లి గ్రామస్తులు,హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరయ్యారు. అంగరంగ వైభవంగా పలు రకాల నృత్యాలతో పెళ్లికి హాజరైన బంధుమిత్రులను అలరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మండల వాసులు హాజరయ్యారు.

Facebook
X
LinkedIn
WhatsApp