రాయచోటి : రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని APPETS, SAPE అసోసియేషన్ అమరావతి ఆంధ్రప్రదేశ్ సభ్యులు రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ రంగంలో తలెత్తుతున్న ఫేక్ సర్టిఫికెట్స్ సమస్యపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌కు మరింత ప్రాధాన్యత కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఫేక్ సర్టిఫికెట్స్ సమస్యను తప్పకుండా పరిగణనలోకి తీసుకొని కఠిన చర్యలు తీసుకుంటామని, స్పోర్ట్స్ రంగం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని APPETS & SAPE అసోసియేషన్ సభ్యులకు మంత్రి హామీ ఇచ్చారు.
Post Views: 3