యర్రవారిపాలెం, ఆగస్టు 18:-
రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు టిడిపి యువ నాయకులు మౌర్యరెడ్డి ఈనెల 17వ తేదీ సుండుపల్లె నుంచి తిరుమలకు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర 2వ రోజు మంగళవారం యర్ర వారిపాలెం మండలం, యలమంద నుంచి ఉదయం 07:00 గంటలకు మౌర్యరెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు. 17వ తేదీ సోమవారం రాత్రి యలమంద పాఠశాలలో రెస్ట్ తీసుకుని ఉదయం తిరిగి యధావిధిగా పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు.
Post Views: 4