20 సూత్రాల కమిటీ చైర్మన్ ను కలిసిన బిజెపి నేతలు

రాయచోటి : 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకరన్ ను అన్నమయ్య జిల్లా బిజెపి నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. శుక్రవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరైన 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకరన్ ను బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్,జిల్లా నేత డాక్టర్ పాలగిరి శ్రీనివాస కుమార్ రాజు, నియోజకవర్గ నాయకులు నిర్మల్ కుమార్ మహేశ్వర రాజు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి అన్నమయ్య జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అలాగే ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

Facebook
X
LinkedIn
WhatsApp