మహానాడును విజయవంతం చేద్దాం వతన్ నిసార్

రాయచోటి : మే 27, 28, 29 తేదీలలో కడపలో జరిగే మహానాడు కార్యక్రమాన్ని రాయచోటి నియోజకవర్గం ప్రజలు విజయవంతం చేయాలని రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి వతన్ నిసార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర రవాణా క్రీడ యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రామాపురం సమీపంలో లక్ష మందికి భోజనం సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ సంవత్సరం కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం, పబ్బాపురం సమీపంలో అత్యంత ఘనంగా మహానాడు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp