బీసీలకు 34% రిజర్వేషన్ ప్రకటించడం శుభ పరిణామం: బత్తిన గంగయ్య యాదవ్

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఫిబ్రవరి 24 మన స్సాక్షి:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ప్రతిపాదించడం శుభ పరిణామమని జనసేన పార్టీ బీసీ నాయకుడు బత్తిన గంగయ్య యాదవ్ పేర్కొన్నారు. గత వైయస్సార్సీపీ ప్రభుత్వం బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్‌ను 24 శాతానికి తగ్గించి బీసీలకు తీరని అన్యాయం చేసిందని వైయస్సార్సీపీ పార్టీకి బీసీలపై ఉన్న సవతి ప్రేమ బయటపడిందని, అందుకే 2024 ఎన్నికల్లో ఆ పార్టీ 11 సీట్లకు పరిమితమైందని విమర్శించారు. రాష్ట్రంలో 50 శాతం జనాభా ఉన్న బీసీలకు ఏ పార్టీ అన్యాయం చేసినా రాజకీయ పతనం అయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు 24 శాతం నుండి 34 శాతం రిజర్వేషన్ పెంచేందుకు ప్రతిపాదించడం అభినందనీయమని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు బీసీల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని, “బీసీలకు రక్షణ చట్టం” అమలుకు కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నదని పేర్కొన్నారు, బిసి చట్టం అమలయ్యే ముందు కొందరు స్వార్థ రాజకీయ నాయకులు కుటిల రాజకీయాలు చేసి, తామే ఈ చట్టం తీసుకువచ్చినట్లు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.బీసీలకు రక్షణ చట్టం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, ఇతర పార్టీలతో సాధ్యం కాదని గంగయ్య యాదవ్ స్పష్టం చేశారు.

Facebook
X
LinkedIn
WhatsApp