స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు హరితమ్మ ప్రశంసలు

రాయచోటి : స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ గ్రౌండ్ లో నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్న స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థినులకు ప్రత్యేకంగా ప్రశంసా పత్రాలను శ్రీమతి మండిపల్లి హరితమ్మ తన చేతుల మీదుగా అందజేశారు. దేశభక్తి క్రమశిక్షణకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతిరూపమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం, స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి, స్కాట్ మాస్టర్ వల్లూరు మహమ్మద్ ఇలియాస్, మునిరత్నం, గైడ్ కెప్టెన్ కొండూరు మదీనా, ఏ ఎస్ ఓ సి లక్ష్మీకర్, వివిధ మండలాల యూనిట్ లీడర్లు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp