సంతృప్తి చెందేలా ప్రజలకు సేవలందించాలి

రాయచోటి : ప్రజలందరూ సంతృప్తి చెందేలా అధికారులు మరియు సిబ్బంది సేవలందించాలని, మార్గదర్శలను, బంగారు కుటుంబాలను మ్యాప్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. పేదరికం లేని సమాజం-పి-4 కార్యక్రమం, ఐ విఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అభిప్రాయాల సేకరణ, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం సాయంత్రం అమరావతిలోని సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు పి4 కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని మార్గదర్శి బంగారు కుటుంబాలను మ్యాప్ చేసే ప్రక్రియను వేగవంతం చేసి ఆగస్టు 15 కల్లా పూర్తయ్యేలా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులు, ప్రజల అభిప్రాయ సేకరణ, ఇసుక లభ్యత, విద్యుత్ అన్నివేళలా అందించడం, వంటి అంశాలలో ప్రజలందరూ సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp