సంతృప్తికర స్థాయిలో సేవలు అందించాలి

రాయచోటి : ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంతి కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ప్రజల అభిప్రాయ సేకరణ, మూడంచెల గ్రామం వార్డు సచివాలయ వ్యవస్థ, ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన, సీజనల్ వ్యాధులు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాయచోటి కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ హాజరయ్యారు. ఆసుపత్రుల సేవలు, రీసర్వే, పౌరసరఫరాల, వ్యవసాయం, పింఛన్ల సమస్యలపై సమీక్ష నిర్వహించి, పనులను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు, సీజనల్ వ్యాధులపై అప్రమత్తత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Facebook
X
LinkedIn
WhatsApp