శ్రీ సాయిలో కళాశాలలో పంద్రాగస్టు వేడుకలు

రాయచోటి : అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం 79 వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సుధాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ వి. బాలాజీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అమరులైన స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో ప్రాణత్యాగమే నేడు స్వేచ్ఛా వాయువుల స్వతంత్ర భారతదేశం అని అభిప్రాయపడ్డారు. ప్రతి విద్యార్థి బాధ్యతలను స్వీకరించి అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఉన్నత స్థానాలను అధిరోహించాలని తద్వారా ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడుతోందని తెలిపారు. వివిధ పోటీలు యందు ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు జ్ఞాపికలను, ప్రశంస పత్రాలను బహుకరించారు. స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను, విన్యాసాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి. వెంకటరమణ వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp