వ్యాపారస్తుల నూతన అసోసియేషన్ ఎన్నిక

రాయచోటి : అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని కంసాల వీధిలోగల మై ఫ్యాషన్ బట్టల దుకాణంలో రాయచోటి వ్యాపార సంఘాల సమావేశం నిర్వహించినట్లు అధ్యక్ష కార్యదర్శులు కోన విజయ్ కుమార్, మయాన ఇర్షాద్ ఖాన్ లు తెలిపారు. ఈ సమావేశానికి రాయచోటిలోని అన్ని రకాల వ్యాపార సంఘాల యజమానులు హాజరై నూతన అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా రెడ్డప్ప (textile), మాయాన హబీబుల్లా ఖాన్(బెల్లంమండి), అధ్యక్షులుగా కోన విజయకుమార్(Rademade Shops), ఉపాధ్యక్షులుగా షేక్.మహబూబ్ బాషా(Home Needs/Electronic), ప్రధాన కార్యదర్శిగా మయాన ఇర్షాద్ ఖాన్(Jewelery), కార్యదర్శిగా పిఎస్ హరినాథ్ రెడ్డి(Footware), కోశాధికారిగా సి విశ్వ జోహార్ జోషి(Textile), ఉప కోశాధికారిగా సయ్యద్ మస్తాన్ (Two whellerAuto mobiles) లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. ఇంకా ఖాళీలు ఉన్నాయని, కమిటీ సభ్యులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp