రాయచోటి : శుక్రవారం రోజు మధ్యాహ్నం రాయచోటిలో వెలసిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా క్రీడ యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రకి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, అర్చకులు, అధికారులు మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 1