వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి

రాయచోటి : విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో 10, లక్షలతో రీ మోడల్ చేసిన ఎస్ఈ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మారుమూల గ్రామాలకు సైతం మెరుగైన విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. విద్యుత్ అధికారులకు ఎటువంటి సమస్యలున్న తెలియజేసి పరిష్కరించుకోవచ్చునన్నారు. ఎక్కడ కూడా లో-వోల్టేజ్ సమస్య ఫిర్యాదులు రాకూడదన్నారు. ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఇ చంద్రశేఖర్ రెడ్డి, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp