వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించాలి

రాయచోటి, కలం మనస్సాక్షి:
నాణ్యమైన సేవలు అందించి వినియోగదారుల మన్ననలను పొందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి పట్టణంలోని మదనపల్లె రహదారి మార్గంలో ప్రొప్రైటర్లు పి. సిద్దారెడ్డి, యు. శివారెడ్డి లచే నూతనంగా ఏర్పాటు చేసిన శిష్యాంత్ ట్రేడర్స్ పెయింట్స్ షాప్ ను ఆయన శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వ్యాపార రంగంలో విజయం సాధించాలంటే నాణ్యతా ప్రమాణాలు, వినియోగదారుల విశ్వాసం చాలా ముఖ్యమని అన్నారు. కొత్త వ్యాపార ప్రయత్నాలు యువతలో స్ఫూర్తినిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ మైనారిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలిమి హారూన్ బాష, ఎంపిటిసి జగన్ మోహన్ రెడ్డి, దప్పేపల్లె రవి రెడ్డి, శంకర్ రెడ్డి, రఫీ, రంగారెడ్డి, పప్పిరెడ్డి జయచంద్రా రెడ్డి, తాటిగుట్ల శంకర్ రెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp