విద్యుత్ అదాలత్‌లో వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం

కె.వి.పల్లి, ఏప్రిల్ 16: ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పీలేరు ఆపరేషన్ డివిజన్ ఆధ్వర్యంలో కె.వి.పల్లి మండలం గర్నమిట్ట విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ అదాలత్ నిర్వహించారు. చైర్‌పర్సన్ వి.ఎస్. ఆంజనేయులు మూర్తి అధ్యక్షతన సభ్యులు జి. మధు కుమార్, ఎ. శ్రీనివాస బాబు, డబ్ల్యూ. విజయలక్ష్మి పాల్గొన్నారు. పీలేరు ఈఈ వై. చంద్రశేఖర్ రెడ్డి, కె.వి.పల్లి ఏఈ వరప్రసాద్ సమన్వయంతో కార్యక్రమం జరిగింది. బిల్లింగ్, మీటర్లు, లో వోల్టేజ్, ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలపై వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించి తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.

Facebook
X
LinkedIn
WhatsApp