పీలేరు మండలంలోని విద్యానికేతన్ పాఠశాల నందు గ్రాడ్యుయేషన్ డే కమ్ వార్షికోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం.జె.పి స్కూల్స్ అన్నమయ్య జిల్లా కన్వీనర్ వైస్ సోమశేఖర్, స్పెషల్ గెస్ట్‌గా డా. వై జనార్దన్ రెడ్డి, గెస్ట్ ఆఫ్ హానర్‌గా రిటైర్డ్ డీఈవో కె నరసింహులు హాజరయ్యారు. అధ్యక్షతను వెలుగు ఏసీ రిటైర్డ్ సిద్దు నాగులు వహించగా, చైర్మన్ ఎన్వి రమణ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.యూకేజీ మరియు 5వ తరగతి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించి, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో తల్లిదండ్రుల సమక్షంలో పాఠశాల ప్రాంగణం కోలాహలంగా మారింది. కార్యక్రమాన్ని కరస్పాండెంట్ మంజుల, హెడ్మాస్టర్ కోమల్ కుమార్ సమన్వయం చేశారు.
Post Views: 4