విజేతలకు నిశ్చల్ నాగిరెడ్డి ప్రైజ్ మనీ పంపిణీ

గాలివీడు : అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం నూలివీడు గ్రామంలో యువత ఉత్సాహాన్ని పెంపొందించేందుకు వెంకట శివారెడ్డి, రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన వారికి రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తనయుడు, టిడిపి యువ నాయకులు నిశ్చల్ నాగిరెడ్డి ప్రైజ్ మనీ అందజేశారు. ఈ సందర్భంగా విజేత విద్యార్థులకు రూ.10,116 బహుమతిని ప్రదానం చేశారు. యువతలో క్రీడా స్పూర్తిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఆటగాళ్లను నిశ్చల్ నాగిరెడ్డి అభినందించి మరింత ఉన్నత స్థాయిలో ప్రదర్శన కనబర్చాలని సూచించారు.

Facebook
X
LinkedIn
WhatsApp