విందు కార్యక్రమంలో మౌర్య రెడ్డి, నిశ్చల్ నాగిరెడ్డి

అన్నమయ్య జిల్లా
రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం గువ్వలచెరువు గ్రామంలో పవిత్ర రంజాన్ సందర్భంగా టిడిపి మైనార్టీ నాయకుడు హోటల్ బాషా ఇచ్చిన విందు కార్యక్రమంలో టిడిపి యువనాయకులు మౌర్య రెడ్డి, మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి కుటుంబ సభ్యులు ఘనంగా సత్కారం నిర్వహించారు. అనంతరం బాషా కుటుంబానికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సురేంద్రారెడ్డి, వినోద్ రెడ్డి మరియు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp