రాయచోటి : అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ వారు అందించిన సర్టిఫికెట్ను సోమవారం సాయంత్రం రాష్ట్ర రాజధాని అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అందుకున్నారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా మే 21 నుండి జూన్ 21 వరకు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా యోగా ఆంధ్ర కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మే 28న అన్నమయ్య జిల్లాలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో ఒక గంటలో ఒక యోగ సెషన్ లో 13,594 మంది హెల్త్ వర్కర్స్ తో యోగా చేయించిన విశేష సందర్భంగా అన్నమయ్య జిల్లా మరియు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించారు.
Post Views: 2