రాయచోటి : లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో వీరబల్లి మండల కేంద్రంలో ఉండే మోడల్ ప్రైమరీ స్కూల్ లో వీరబల్లి వాస్తవ్యులు నాగరాజ ఆర్థిక సహాయంతో పిల్లలకు నోట్ బుక్స్,పెన్నులు,పెన్సిల్స్ పంపిణీ చేసి అనంతరం మొక్కలు నాటడం జరిగిందని అధ్యక్షుడు లయన్ పి.శ్యామ్ తెలిపారు. దాత నాగరాజ మాట్లాడుతూ నా సొంత ఊరీలో నేను చదువుకున్న మోడల్ ప్రైమరీ స్కూల్ లో నా వంతుగా సహాయ సహకారాలు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ లయన్ షేక్.మహమ్మద్, కోశాధికారి లయన్ కె.మనోహర్ రాజు, లయన్ యస్.షంషీర్ వలి, లయన్ టి.రామాంజనేయులు, స్కూల్ టీచర్స్ రెడ్డప్ప రెడ్డి, శివరామరాజు, చెన్నకృష్ణ, నాగేంద్ర మణి పాల్గొన్నారు.
Post Views: 4