లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

రాయచోటి : లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో సురేష్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా చిత్తూరు రోడ్డు మార్గాన గుడిసెలలో నివసించే పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు అధ్యక్షుడు లయన్ పి.శ్యామ్ తెలిపారు. అనంతరం దాత రోసిరెడ్డి మాట్లాడుతూ నా కుమారుడు సురేష్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో చిత్తూరు రోడ్డు మార్గాన గుడిసెలలో నివసించే పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ పి ఎస్ హరినాథ్ రెడ్డి, రీజనల్ ఛైర్మన్ లయన్ షేక్ మహమ్మద్,ఉపాధ్యక్షుడు లయన్ వి.హరీష్ చంద్ర,మాజీ అధ్యక్షుడు లయన్ శివారెడ్డి, కార్యదర్శి లయన్ షేక్ ఇందాద్ అహమ్మద్, దాత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp