రాయచోటి : ఉమ్మడిశెట్టి మునిస్వామి 2 వ వర్ధంతి సందర్భముగా కుమారుడు చైతన్య కుమార్ ఆర్థిక సహాయంతో లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో.చిత్తూరు రోడ్డులో ఉండే ST కాలనీ దగ్గర గుడిసెలలొ నివసించే పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అధ్యక్షుడు లయన్ పి.శివారెడ్డి తెలిపారు. దాత చైతన్య కుమార్ మాట్లాడుతూ నా తండ్రి 2వ వర్ధంతి సందర్భముగా నా వంతుగా ప్రజలకు ఉపయోగపడే సేవ చేయాలనే ఉద్దేశంతోనే అన్నదాన కార్యక్రమం నిర్వహించమన్నారు. ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోన్ ఛైర్మన్ లయన్ షేక్ మహమ్మద్, డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ వి హరీష్ చంద్ర,వినోద్ కుమార్ నాయక్ ,తదితరులు పాల్గొన్నారు
Post Views: 2