తిరుపతి జిల్లా రైల్వే కోడూరు, మార్చి 25 మనస్సాక్షి : మండల పరిధిలోని సూరపురాజుపల్లి గ్రామంలో బుధవారం “రైతన్నా… మీకోసం” కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన మూడో విడత “అన్నదాత సుఖీభవ” కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి,కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి చేపట్టారు. ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి గ్రామంలోని ఇంటిటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి , రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. “అన్నదాత సుఖీభవ” మూడో విడత నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధికి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలియజేశారు . రాష్ట్ర–కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో రైతులకు ఇంతకు మునుపు ఎన్నడూ లేని స్థాయిలో ప్రయోజనాలు అందుతున్నాయని, భవిష్యత్తులో మరిన్ని పథకాలు తీసుకురావడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులతో పాటు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, తల్లెం రమణారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సంగరాజు రవికుమార్ రాజు, వై జయప్రకాశ్, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
“రైతన్నా… మీకోసం” కార్యక్రమంలో ముక్కా రూపానందరెడ్డి
Post Views: 2
Facebook
X
LinkedIn
WhatsApp