రాయచోటి : రాయచోటి నియోజకవర్గాన్ని విద్యా హబ్ గా అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాయచోటి పట్టణంలోని వైవి నగర్, వండాడి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎంబీఏ మరియు ఎంసీఏ కళాశాలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రాయచోటి ప్రాంతానికి విద్యాపరంగా ఒక ప్రత్యేక గుర్తింపుతో పాటు ఎంతమంది విద్యార్థులు ఈ ప్రాంతం నుంచి చదివి మంచి హోదాలో ఉన్నారన్నారు. విద్య హబ్ గా అభివృద్ధి చేసేందుకు తమ వంతు ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందన్నారు. రాయచోటి పట్టణంలో ఇందిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వారి ఆధ్వర్యంలో ఎంబీఏ, ఎంసీఏ కళాశాల ను ఏర్పాటు చేయడం ఎంతో శుభప్రదమన్నారు.
Post Views: 1