తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాల నందు రక్షణ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రైల్వే కోడూరు అర్బన్ సిఐ సి. చంద్రశేఖర్ రక్తదానం చేసిన 80 మంది విద్యార్థినీ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానం చేసి విద్యార్థులను అభినందించారు. ముఖ్య అతిథి చంద్రశేఖర్ మాట్లాడుతూ, రక్ ప్రాణాపాయంలో ఉన్న రోగులకు రక్త దానం జీవనాధారం అవుతుందని, యువత ఇలాంటి ఉన్నతమైన సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉత్తమ మార్గంలో సాగాలని ఆకాంక్షించారు.సాయి డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు ముత్యాల పెంచలయ్య మాట్లాడుతూ కళాశాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను తరచుగా నిర్వహించి సమాజానికి సేవ చేయడం తమ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా సుమారు 80 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఆదపాల శివకుమార్ మరియు వసంత కుమార్ పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
రక్త దానం ప్రాణధారం – సిఐ సి.చంద్రశేఖర్
Post Views: 3
Facebook
X
LinkedIn
WhatsApp