రక్తదానం ప్రతి ఒక్కరికీ అలవాటు కావాలి

రాయచోటి : అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం నిండు ప్రాణాన్ని కాపాడగలరు. అన్నమయ్య జిల్లా దేవ పట్ల కు చెందిన సావిత్రి అనే మహిళ గత కొద్ది రోజులుగా రక్తహీనతతో బాధపడుతూ విజయ హాస్పిటల్ లో చేరింది. ఏపీ పాజిటివ్ రక్తము అత్యవసరంగా కావాలని బ్లడ్ ఫౌండేషన్ మాయాన మహమ్మద్ అలీ పఠాన్ కు అడగగా రాయచోటి వ్యాపారవేత్త నహవిల్ ను సంప్రదించగా స్పందించి రక్తదానం చేయడానికి అంగీకరించారు. దాత నహవిల్, మాయాన మహమ్మద్ అలీ పఠాన్ లకు పేషంట్ బంధువుల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దీప బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సులోచనమ్మ, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp