మౌలిక సదుపాయాలు గ్రామాల అభివృద్ధికి బాటలు: ముక్కా రూపానంద రెడ్డి

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు, మార్చి 05 (మనస్సాక్షి):

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేట మండల పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని రైల్వే కోడూరు టీడీపీ ఇంచార్జ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని అన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం వల్ల గ్రామస్థులకు సౌకర్యం కలుగడంతో పాటు అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని తెలిపారు.కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి గ్రామాలలో , వీధులలో , పట్టణాలలో అభివృద్ధి పనులునిరంతరంగా కొనసాగుతున్నాయని తెలియజేశారు. భవిష్యత్తులో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.ప్రజలు తమపై చూపుతున్న ప్రేమాభిమానాలు తమకు ఆశీర్వచనాలుగా భావిస్తున్నామని ఆయన అన్నారు. కార్యక్రమం లో 

తెలుగుదేశం నాయకురాలు, మాజీ సర్పంచ్ గంగరాజు పుష్పలత, మహిళా నాయకురాలు సంపూర్ణ తదితర కూటమి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp