మైనార్టీ నాయకుల విందు కార్యక్రమంలో మంత్రి

రాయచోటి పట్టణంలో పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని టిడిపి మైనార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని పలువురు మైనార్టీ నాయకులు ఎజాస్ ఖాన్, జాఫర్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ విందులో మంత్రి పాల్గొని వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి నిర్వాహకులు, వారి కుటుంబ సభ్యులు ఘనంగా సత్కారం నిర్వహించారు. అనంతరం ఆయన రాష్ట్రంలోని మైనార్టీ సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి నాయకులు గఫార్ ఫంక్షన్ హాల్ రియాజ్, ఇర్షాద్, కార్యకర్తలు, మైనార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp