మాస్టర్ టైలర్ కోర్సు శిక్షణ కొరకు విశేష స్పందన..* కె పార్థసారథి

రైల్వే కోడూరు మార్చి 04 మనస్సాక్షి

కోడూరు పట్టణంలోని గిరిజమ్మ వీధిలో గల గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ టైలరింగ్ శిక్షణా కేంద్రము నందు నారీ నైపుణ్యం ప్రాజెక్ట్ ద్వారా మహిళలకు మాస్టర్ టైలర్ కోర్సు నందు ఉచిత శిక్షణ కు మహిళలనుండి విశేషస్పందన లభించిందని ట్రస్ట్ చైర్మన్ కె.పార్థసారధి తెలిపారు. మొదటి ఇంటర్వూ కొరకు 68 మంది మహిళలు హాజరు కాగా రెండవ ఇంటర్వ్యూ కొరకు 15 మంది అవకాశం పొందారని వీరిలో కొంతమందిని ఎంపిక చేసి ఈ నెల 8వ తేదీన శిక్షణ ప్రారంభిస్తామన్నారు. అధునాతన పద్దతులలో శిక్షణ ఇవ్వడమే కాకుండా శిక్షకురాలిగా, బోటిక్ నిర్వాహకురాలిగా పాటించాల్సిన పద్ధతుల గురించి మెళకువలు నేర్పిస్తామన్నారు. ఇప్పటి వరకు మహిళా టైలర్ లను తయారుచేశామని, మాస్టర్ టైలర్ కోర్సు ద్వారా మాస్టర్ గా, ట్రైనర్ గా, మహిళా వ్యాపార వేత్తగా ఎదిగేందుకు సహాయ సహకారాలు అందిస్తామని, శిక్షణా కాలంలో 10 వేల రూపాయలు విలువగల టైలరింగ్ మెటీరియల్స్ టూల్ కిట్ ను, శిక్షణ అనంతరం 20 వేల రూపాయలు విలువ గల ఇండస్ట్రియల్ కుట్టు మెషిన్ ఉచితంగా అందజేస్తామని తెలియజేశారు.తదనంతరం ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా కో ఆర్డినేటర్ శ్రీహరి ద్వారా మహిళలకు ఆర్థిక క్రమశిక్షణపై, పొదుపు, భీమా, బ్యాంకింగ్ పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మహిళలు, ట్రైనర్ లు కావేరి, సుప్రియ పాల్గొన్నారు

Facebook
X
LinkedIn
WhatsApp