మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మౌనేంద్రకుమార్ రెడ్డి

రైల్వే కోడూరు ఫిబ్రవరి 25 మనసాక్షి:

పులివెందుల పర్యటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని రైల్వే కొడూరు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మౌనేంద్ర కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఈ రైల్వే కొడూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు,యువతను పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుకుగా భాగస్వామ్యం చేయడం వంటి అంశాలపై సవివరంగా చర్చించామని. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాయని వివరించానని తెలిపారు. విద్యార్థి,యువ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ, ప్రజలతో నిరంతరం అనుసంధానంగా ఉండాలని,పార్టీ సిద్ధాంతాలను మరింత బలోపేతం చేయాలంటూ సూచించారని.“ప్రజల నమ్మకమే మన బలం”, ధైర్యంగా ముందుకు సాగండి,నేను మీకు అండగా ఉంటానని” జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చినట్లు మునేంద్ర కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు 

Facebook
X
LinkedIn
WhatsApp