అన్నమయ్య జిల్లా చిన్నమండం మండలంలోని చాకిబండ బలిజపల్లె, కురవపల్లె గ్రామాల్లో శ్రీ మల్లూరమ్మ జాతర బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. స్థానిక నాయకుల ఆహ్వానంపై రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, మాజీ టీటీడీ పాలకమండలి సభ్యుడు సుగవాసి ప్రసాద్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చాందిని బండ్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ దేవతల జాతరలు ఐక్యతను పెంపొందిస్తాయని, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 2